AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త..! నౌకపై దాడి 11 మంది భారత నావికులకు గాయాలు..

ఒమన్ తీరంలోని హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జలసంధి గుండా ప్రయాణిస్తున్న పనామా జెండాతో కూడిన ‘ఎంటీ ఆన్ పీస్’ అనే వాణిజ్య నౌకపై మంగళవారం రాకెట్ దాడి జరిగింది. ఈ ఘటనలో 11 మంది భారత నావికులతో సహా మొత్తం 12 మంది సిబ్బంది గాయపడ్డారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ నౌకలో మొత్తం 19 మంది సిబ్బంది ఉండగా, వారిలో 17 మంది భారతీయులే. దాడి జరిగిన వెంటనే ఒమన్ అధికారుల సహకారంతో గాయపడిన వారిని సమీపంలోని ఖసాబ్ నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నౌకపై జరిగిన ఈ దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. బాధితులను ఆసుపత్రికి తరలించడంలో సహకరించిన ఒమన్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్తలు తెలియజేసింది.

ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతుండటంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పౌర మౌలిక సదుపాయాలు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడాన్ని తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలమార్గాల్లో నౌకాయానం, వాణిజ్యం సజావుగా సాగేలా చూడాలని పిలుపునిచ్చింది.

ANN TOP 10