సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్‌లోని మంత్రులందరికీ కొత్త ల్యాండ్ క్రూయిజర్ కార్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఒక్కో మంత్రికి ఒక్కో ల్యాండ్ క్రూయిజర్‌ను కేటాయించారు. ఈ వాహనాలకు ఆయా మంత్రులు పూజలు కూడా నిర్వహించారు.
ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి మాత్రమే ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్ ల్యాండ్ క్రూయిజర్ కార్లను సమకూర్చేది. ఇకపై మంత్రులకు కూడా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను సమకూర్చింది ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్. ఒక వైపు ఆర్థిక ఇబ్బందులు అంటూనే మరో వైపు మంత్రులకు ల్యాండ్ క్రూయిజర్ కార్లను కేటాయించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇటీవల విజయవాడలో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అనంతరం మంత్రులకు వాహనాలను కేటాయించిన ప్రోటోకాల్ డిపార్ట్‌మెంట్.









