AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్‌కు బిగ్‌ ‘షాక్‌’!… ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు విషయంలో నోటీసులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు బిగ్‌ షాక్‌.. ఛత్తీస్‌ గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు విషయంలో జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నోటీసులు పంపారు. ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల నిర్మాణంతో పాటు ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై నిర్ణయాల్లో భాగస్వాములైన ప్రస్తుత, మాజీ అధికారులను జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ కొద్ది రోజులుగా విచారిస్తోంది. దీనిలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో తాజాగా మాజీ సీఎం కేసీఆర్‌ కి నోటీసులు జారీ అయ్యాయి. కేసీఆర్‌ కి జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి నోటీసులు పంపారు. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది. ఈ నెల 30వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

జూలె 30 వరకు సమయం కోరిన కేసీఆర్‌..
ఆ నోటీసులపై మాజీ సీఎం కేసీఆర్‌ స్పందించారు. వచ్చేనెల 30 వరకు విచారణకు హాజరుకాలేనని వివరణ ఇచ్చారు. ఇక ఇప్పటికే అసెంబ్లీ, లోక్‌ సభ ఎన్నికల్లో పరాజయంతో సతమతమవుతున్న బీఆర్‌ఎస్‌ అధినేతకు ఇప్పుడు ఈ నోటీసులు జారీ కావడం మరో గట్టి షాక్‌ అనే చెప్పాలి.

ANN TOP 10