AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలీవుడ్‌ నటి ఆత్మహత్య.. కుళ్లిపోయి ఫ్యాన్‌కు వేలాడుతున్న శవం

(అమ్మన్యూస్, ముంబాయి):
బాలీవుడ్‌ నటి నూర్‌ మాళబిక దాస్‌ ఆత్మహత్య చేసుకుంది. ముంబాయిలో ఖండ్వాలాలోని తన ఫ్లాట్‌ లో సూసైడ్‌ కు పాల్పడింది. మీడియా రిపోర్ట్‌ ప్రకారం తన బెడ్‌ రూమ్‌ లోని ఫ్యాన్‌ కు ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లాట్‌ నుంచి దుర్వాసన రావడంతో పక్కింటి వారు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. డోర్‌ ఓపెన్‌ చేయగా షాక్‌ కు గురయ్యారు. కుళ్లిన శవం వేలాడుతున్నట్టు తెలిపారు. కాగా ఆమె జూన్‌ 6న ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు.

ఇక ఫ్లాట్‌ లో నూర్‌ మెడిసిన్, ఫోన్, డైరీ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. బాడీని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇక నూర్‌ కాజోల్‌ ’ ది ట్రయల్‌’ లో కీలక పాత్రలో కనిపించింది. నటిగా మారే ముందు ఎయిర్‌ హోస్టెస్‌ గా వర్క్‌ చేశారు.

ANN TOP 10