AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘హనుమాన్ అంశ్’ తెలుగులో భారీ హైప్..! సంచలనం సృష్టించేనా..?

ఈ మధ్య కాలంలో చాలా మంది మాట్లాడుకున్న సినిమానే ‘ హనుమాన్ అంశ్’. ఎక్కడ చూసినా ఈ సినిమాను గురించిన చర్చలే నడిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. హిందీలో ఈ సినిమాను కేవలం 2 కోట్ల రూపాయలతో నిర్మించారు. దర్శకుడు విశాల్ చతుర్వేది కూడా ఒక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా 400 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టడం విశేషం. ఇటీవల కాలంలో ఇంత తక్కువ బడ్జెట్ లో నిర్మాణం జరుపుకుని ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు.
 
ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత చరిత్రనే ‘హనుమాన్ అంశ్’ పేరుతో తెరకెక్కించారు. ఉత్తర ప్రదేశ్ కి చెందిన నీమ్ కరోలీబాబా, చాలా చిన్న వయసులోనే అనేక అద్భుతాలు చేశారు. ఆయన హనుమను ఎక్కువగా ఆరాధించేవారు. ఆయనను అంతా హనుమంతుడి అంశావతారంగానే భావించేవారు. సత్యం .. ధర్మం .. ప్రేమ అనే మూడు విషయాలను గురించి ఆయన ఎక్కువగా ప్రస్తావించేవారు. 

అలాంటి నీమ్ కరోలీ బాబా గురించి తెరకెక్కించిన ఈ సినిమా, విడుదలైన అన్ని ప్రాంతాలలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాను ఈ నెల 9వ తేదీన తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. దక్షిణాదిన నీమ్ కరోలి బాబా గురించి తెలిసినవారి సంఖ్య తక్కువే. ఈ సినిమా తరువాతనే ఆయన గురించి ఎక్కువమంది సెర్చ్  చేశారని చెప్పాలి. మరి ఈ సినిమా దక్షిణాదిన ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

ANN TOP 10

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి..