AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సిర్పూర్-కాగజ్‌నగర్ రైలులో మంటలు.. తప్పిన ముప్పు..!

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ సమీపంలో బుధవారం ఉదయం సిర్పూర్-కాగజ్‌నగర్ వెళుతున్న రైలులో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే, రైల్వే సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

వివరాల్లోకి వెళితే, రైలు బీబీనగర్ స్టేషన్ సమీపానికి చేరుకుంటున్న క్రమంలో, ఒక బోగీ చక్రానికి బ్రేక్ లైనర్‌లు పట్టేయడంతో ఏర్పడిన రాపిడి వల్ల పొగలు, మంటలు చెలరేగాయి. దీనిని వెంటనే గమనించిన కో-పైలట్, లోకో పైలట్‌ను అప్రమత్తంచేయడంతో రైలును బీబీనగర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు.

సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, అగ్నిమాపక దళం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం సాంకేతిక సిబ్బంది అవసరమైన మరమ్మతులు పూర్తి చేయడంతో రైలు తిరిగి సిర్పూర్-కాగజ్‌నగర్‌కు బయలుదేరింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ANN TOP 10

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి..