AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రి ప్లాంట్‌పై హరీశ్‌కు భట్టి సవాల్..! రూ.40,000 కోట్ల భారం ఎవరిదని ప్రశ్న..!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ మంత్రి హరీశ్‌రావుపై విమర్శలు గుప్పించారు. బొగ్గు సరఫరాకు సరైన ఏర్పాట్లు చేయకుండానే ప్లాంట్‌ను నిర్మించి రాష్ట్ర ప్రజలపై రూ.40,000 కోట్ల భారం మోపారని ఆరోపించారు. ఈ తప్పిదాలకు ఎవరు బాధ్యత వహించాలని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ఎల్ నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో విద్యుత్ గరిష్ఠ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరిందని తెలిపారు. ఇంతటి డిమాండ్ ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి కోతలు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోందని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి అసత్యాలు ప్రచారం చేయడం సరికాదన్నారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు పలికారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి నుంచి బొగ్గు లింకేజీ ఇస్తామని హామీ ఇచ్చి యాదాద్రి ప్లాంట్‌ను ప్రారంభించిందని, కానీ ప్లాంట్‌కు అవసరమైన జీ9 గ్రేడ్ బొగ్గు సింగరేణిలో అందుబాటులో లేదని భట్టి గుర్తుచేశారు. సింగరేణి నుంచి 7 మిలియన్ టన్నులు, మిగిలింది దిగుమతి చేసుకుంటామని ఒప్పందాలు చేసుకున్నా, బీఆర్ఎస్ హయాంలో వాటిని నెరవేర్చలేదని విమర్శించారు. బొగ్గు అనుసంధానం లేకుండానే ప్లాంట్‌ను నిర్మించారా లేదా అనే దానిపై హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బొగ్గు సరఫరాకు ఏర్పాట్లు చేసి మూడు యూనిట్లను ప్రారంభించిందని భట్టి వివరించారు. 

జెన్‌కో, ట్రాన్స్‌కోలను ప్రైవేటీకరిస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రతిపక్షాలు విద్యుత్ అంశంపై రాద్ధాంతం చేస్తున్నాయని, తమ ప్రభుత్వానికి ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి..