కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పెషల్ థ్యాంక్స్
(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
మోదీ కేబినెట్‌లో మరోసారి చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలుపుతున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా కేబినెట్ మంత్రిగా పనిచేశానని, ఇప్పుడు రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చిందని చెప్పారు. కేంద్ర క్యాబినెట్‌లో ఎలాంటి శాఖ ఇచ్చిన సమర్థవంతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. తనను ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి గతంలో కూడా ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చానన్నారు. కొందరు రాజకీయంగా తనను విభేదించి.. కామెంట్లు చేసే మూర్ఖులను అసలు పట్టించుకోనన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు టెక్ట్స్‌టైల్ పార్కు, రైల్వే ప్రాజెక్టులు , కేంద్ర సంస్థలు తీసుకొచ్చానని కిషన్ రెడ్డి తెలిపారు.









