AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రాక్టర్‌తో తొక్కించి కానిస్టేబుల్‌ హత్య

లక్నో, జూన్‌ 9: ఉత్తరప్రదేశ్‌లో ఇసుక మాఫియా ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. తమను అడ్డుకున్న పోలీసులపైకి దాడులకు తెగబడుతున్నారు. నవాబ్‌గంజ్‌ ప్రాంతంలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ (24)ను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా హత్య చేశారు. ఇసుక అక్రమ రవాణా సాగుతుందన్న సమాచారం అందుకున్న సబ్‌ ఇన్‌ప్పెక్టర్‌ సంతోశ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ చమన్‌, రోహిత్‌ కుమార్‌లు శనివారం రాత్రి నాగ్లా చందన్‌కు వెళ్లారు.

ట్రాక్టర్‌లో ఇసుకను తరలిస్తున్న కొంతమందిని అడ్డుకొని పోలీసులు ప్రశ్నిస్తుండగా, డ్రైవర్‌ హఠాత్తుగా వారిపైకి ట్రాక్టర్‌ను పోనిచ్చాడు. తీవ్రంగా గాయపడ్డ రోహిత్‌ కుమార్‌ను సమీపంలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించామని, అయితే ఆదివారం అతడు మరణించాడని జిల్లా ఎస్పీ వికాస్‌కుమార్‌ తెలిపారు. ఈ దాడి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని అన్నారు.

ANN TOP 10