AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళా ప్రొఫెసర్‌కు లైంగిక వేధింపులు.. సీబీఐటీలో ఉద్యోగుల ఆందోళన

సీబీఐటీలో IQAC డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. IQAC డైరెక్టర్లుగా ఉన్న సుశాంత్‌బాబు, త్రివిక్రమ్‌ గత కొంతకాలంగా మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై ఓ మహిళా ప్రొఫెసర్‌ కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. కానీ యాజమాన్యం పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని ప్రిన్సిపల్‌ నర్సింహులు కొట్టిపారేశారు.

ప్రిన్సిపల్‌ వైఖరితో కంగుతిన్న ఆ మహిళా ప్రొఫెసర్‌ తన సహోద్యోగులకు జరిగిన విషయాన్ని చెప్పి కన్నీటి పర్యంతమైంది. దీంతో బోధన, బోధనేతర సిబ్బంది మొత్తం ఏకమై IQAC డైరెక్టర్లు, ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని, IQAC డైరెక్టర్లు సుశాంత్ బాబు త్రివిక్రమ్ రావులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ప్రిన్సిపల్‌ వెళ్లకుండా అడ్డంగా పడుకుని బోధనేతర ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సంజీవ్‌ పై నుంచి ప్రిన్సిపల్‌ నర్సింహులు బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆందోళన ఉధృతం చేస్తామని బోధన, బోధనేతర సిబ్బంది స్పష్టం చేశారు.

ANN TOP 10