AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు

ఆరోగ్య శ్రీ పథకంలో అదనంగా 65 అధునాతన చికిత్స విధానాలను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. వీటితో పాటు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వాటిలో 1,375 విధానాలకు ప్యాకేజీ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

ఆరోగ్య శ్రీ పథకం కింద కొత్త చికిత్స విధానాలు, ప్రస్తుత పథకాల ఆర్థిక సవరణకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో మంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూసకు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇక నుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే ఆరోగ్యశ్రీలో 1672 చికిత్స విధానాలు అందుబాటులో ఉండగా.. వాటిలో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ANN TOP 10

తమిళనాడు ముఖ్యమంత్రి తిరు. సి. జోసెఫ్ విజయ్ ఈ నెల 11వా తేదీన విజయవాడ కు విజయ్ ఆహ్వాననించినా ఆంధ్ర ప్రదేశ్ ఎంపీ లు శ్రీ కృష్ణా దేవ రాయలు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేశినేని శివనాథ్ జీఎంసీ హరీష్ బాలయోగి విజయవాడ ఉత్సవ్ కమిటీ చైర్మన్ కె. మురళి..