AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

8న మోదీ ప్రమాణ స్వీకారం.. ముహూర్తం ఫిక్స్‌

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయ సాధించగా మూడోసారి ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 8న ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం కర్తవ్యపథ్‌ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించనున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ పక్షాలు హాజరుకానున్నాయి.

ఎన్డీయేపై పెరిగిన విశ్వాసం..
‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇది భారత తిరుగులేని విధేయత సాధించిన విజయం’ అని ప్రధాని మోదీ అభివర్ణించారు. బీజేపీ, ఎన్డీయేపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలతోపాటు ఓటర్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ANN TOP 10