AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ఎన్నికల ఫలితాలపై షర్మిల ఏమన్నారంటే…

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ఏపీ ఎన్నికల ఫలితాల పై ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్‌ షర్మిల స్పందించారు. తన అన్న ఓటమి పైన ఒక్క వ్యాఖ్య చేయలేదు. కడప ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేదు. ఎన్నికల ప్రచార సమయం లో జగన్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని షర్మిల పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కి శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల సూచనలు షర్మిల కూటమిలో బీజేపీ మినహా రెండు పార్టీల నేతలకు శుభాకాంక్షలు చెప్పారు.

ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని పేర్కొన్నారు. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం జరగాలని సూచించారు. నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని షర్మిల డిమాండ్‌ చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలని షర్మిల పేర్కొన్నారు.

ఎండగడతాం
ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ..జనం గొంతుకగా మారిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇక మీద కూడా రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడుతుందిని చెప్పిన షర్మిల.. ప్రభుత్వ నిర్లక్ష్యాలను ఎండగడుతుందని స్పష్టం చేశారు.

ANN TOP 10