AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా.. మంత్రి కోమటిరెడ్డికి హరీష్ రావు సవాల్

మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ట్యాపింగ్ దొంగ ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడని, ఆయనను కలిసేందుకు హరీష్ రావు అమెరికా వెళ్లారన్నారు. ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పి వచ్చారని ఆరోపించారు. హరీష్‌రావు దొంగచాటుగా గత సీఎండీ ప్రభాకర్ రావును అమెరికా వెళ్లి కలిసి వచ్చారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందించి.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మతి భ్రమించిందని విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వారి మంత్రులు అబద్దాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని వ్యాఖ్యానించారు. తాను కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లింది వాస్తవమేనని అన్నారు. కానీ అమెరికాలో ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేస్తారా అంటూ ప్రశ్నించారు. అది నిరూపిస్తే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ప్రభాకర్ రావును కలిసినట్లు రుజువు చేయకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పని తేలితే అమరవీరుల స్థూపం వద్ద ఆయన ముక్కు నేలకు రాయాలన్నారు. తన పాస్‌పోర్టు, ఇతర వివరాలతో బహిరంగ చర్చలకు సిద్ధమని, కోమటిరెడ్డి చెప్పిన సమయానికి అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు.

ANN TOP 10