గులాబీ జెండా పుట్టింది తెలంగాణ సంరక్షణ కోసం. గులాబీ జెండా పని చేసింది తెలంగాణ కోసం. తెలంగాణ వస్తుందని ఎవరూ కలలో కూడా కనలేదు. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్ర వచ్చింది. బీఆర్‌ఎస్‌ను ఖతం చేస్తామని కొందరు మాట్లాడుతున్నారు. ఇవన్నీ టెంపరరీ సెట్ బ్యాక్స్. మళ్లీ మేం అధికారంలోకి వస్తాం. అందులో 100 శాతం అనుమానం లేదు. 25 ఏళ్ల ప్రస్థానమున్న పార్టీని ఖయం చేయగలరా. పదేళ్లు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఖతమైందా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనదే అధికారం. అన్ని రంగాల్లో తెలంగాణలో నెంబర్‌గా నిలిపాం. ఎలా ఉన్న ప్రజల కోసం పని చేయడమే మన కర్తవ్యం.
-మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
రాష్ట్ర అవతరణ వేడుకల వేళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లైన్‌మెన్‌లను హరీష్ రావు పనిచేయనివ్వట్లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని, అసలు ముఖ్యమంత్రి హరీష్ రావా.. రేవంత్ రెడ్డా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి అమరవీరులకు కేసీఆర్ నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రజలకు దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొప్ప ఉద్వేగభరితమైన క్షణం ఈరోజని అన్నారు. భరించలేనటువంటి అమానుషానికి తెలంగాణ లోలైందన్నారు. దు:ఖాన్ని తలుచుకుని బాధపడేవాళ్లమని చెప్పారు. తెలంగాణ అని మాట్లడడమే కష్టంగా ఉన్న రోజులు అవి అంటూ గుర్తు చేశారు. తెలంగాణ అనకూడదని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు ఇచ్చారన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణవాది అన్నారు. రాజీలేని పోరాటం చేసిన ఆయన తనతో ఉండేవారని చెప్పారు. అన్ని సందర్భాల్లో ఆయన తోడుగా ఉన్నారని గుర్తు చేశారు. ఆయన లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని చెప్పుకొచ్చారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలను జయశంకర్ ప్రశ్నిస్తూనే ఉన్నారని, వాటిని రికార్డు చేశారని కేసీఆర్ చెప్పారు.
*ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వలేదు*
నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించినా జయశంకర్ సార్ బెదరలేదన్నారు. రాజ్ భవన్ గేటు ఎదురుగా బుల్లెట్లు కొడుతుంటే ఉద్యమకారులు రాళ్లు వేశారని.. ప్రాణాలకు తెగించి తూటాలకు ఎదురు వెళ్లారని వివరించారు. ఆ సందర్బంలో రైలు పట్టాల మీద పడి 9 మంది చనిపోయారని కేసీఆర్ చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ముల్కీ రూల్స్ కు అనుకూలంగా తీర్పు వెలువరించిందని చెప్పారు. దీంతో జై ఆంధ్రా ఉద్యమం వచ్చిందన్నారు. జై ఆంధ్రా ఉద్యమంలో 70 మంది వరకు చనిపోయారని దీంతో సుప్రీంకోర్టు తీర్పుకు చెల్లుబాటు లేకుండా నాటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిందని గుర్తు చేశారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడినవాళ్లు కూడా లేరన్నారు. పాలమూరులో సభ పెట్టి పోరాటం చేస్తే.. అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు. అప్పట్లో కుడి కాలువకు ఫ్రీ..ఎడమ కాలువకు ఛార్జీలు వసూలు చేసేవాళ్లు అని తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఉండాలని.. తాను నిలదీస్తే ప్రభుత్వం దిగొచ్చిందని కేసీఆర్ వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఓట్ల కోసం రైతు బంధు ఇవ్వలేదన్నారు. చేప పిల్లలు, గొర్రె పిల్లలను పంపిణీ చేస్తే అపహస్యం చేశారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరికష్టం చేశారని అన్నారు. రాజకీయం అంటే నిరంతర ప్రవాహమని, అధికారంలో ఉంటేనే రాజకీయం కాదన్నారు. రైతుబంధు పథకం అతీగతీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ బీఆర్ఎస్ గెలిచిందని కేసీఆర్ తెలిపారు.









