నాలుగో అంతస్తు నుంచి సెల్లార్‌కు పడిపోయిన వైనం
కిన్నెర గ్రాండ్ హోటల్‌లో ఘటన
(అమ్మన్యూస్, హైదరాబాద్):
నాగోల్ – అల్కాపురి ఎక్స్ రోడ్డులో ఉన్న కిన్నెర గ్రాండ్ హోటల్‌లో ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తు నుంచి సెల్లార్‌కు రావాల్సిన లిఫ్ట్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కిన్నెర గ్రాండ్ హోటల్‌లోని నాలుగో అంతస్తులో ఓ ఫంక్షన్ జరిగింది. ఆ వేడుకకు అతిథులు తరలివచ్చారు. అయితే ఎనిమిది మంది నాలుగో ఫ్లోర్‌లో లిఫ్ట్ ఎక్కి సెల్లార్‌కు వచ్చేందుకు బటన్ నొక్కారు. క్షణాల్లోనే ఆ లిఫ్ట్ కుప్పకూలిపోయింది. దీంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారు గట్టిగా అరవడంతో అప్రమత్తమైన హోటల్ సిబ్బంది సెల్లార్‌కు వచ్చి లిఫ్ట్ డోర్లను బ్రేక్ చేసి, వారిని బయటకు తీశారు. అనంతరం ఎల్‌బీనగర్‌లోని కామినేని హాస్పిటల్‌కు 108 అంబులెన్స్‌లో తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కిన్నెర గ్రాండ్ హోటల్‌పై నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.









