హీరో మహష్ బాబు భావోద్వేగమైన పోస్టు చేశారు. ఆయన కుమారుడు గౌతమ్ గ్రాడ్యుయేషన్ వేడుకల ఫొటోలను షేర్ చేస్తూ తన హృదయం గర్వంతో ఉప్పొంగుతోందని ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘నీ తర్వాతి చాప్టర్ నువ్వే రాసుకోవాలి. నువ్వు మరింత వెలుగొందుతావని భావిస్తున్నా. నీ కలలను సాకారం చేసుకో. తండ్రిగా నేను ఈ రోజు గర్వపడుతున్నా’ అని గౌతమ్‌ను ఉద్దేశించి మహేష్ బాబు రాసుకొచ్చారు.









