AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తాజాగా ఓ నేషనల్ మీడియా ఆయన ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎన్డీఏ కూటమి 17 ఎంసీ స్థానాలు గెలుస్తోందని విశ్వాసం వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పట్ల సంతృప్తితో ఉన్నారని అన్నారు. అలాగే ఏపీలో ఎన్డీఏ కూటమి అలాగే ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ఒడిషాలోనూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమాను వ్యక్తం చేశారు. ఏపీ, కర్నాటకలో కాంగ్రెస్ రాజ్యాంగానికి విరుద్ధంగా మతపరమైన ముస్లిం రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి వ్యతిరేకమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని, ఓబీసీల రిజర్వేషన్లను కాపాడుతామని అమిత్ షా అన్నారు.

ANN TOP 10