AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘నిమ్స్‌’ పేదల దేవాలయం.. సీఎం రేవంత్‌ ఆసక్తికర పోస్టు

నిండుప్రాణాన్ని కాపాడిన వైద్యులకు అభినందనలు

‘బాణం’ ఘటనపై స్పందన

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిమ్స్‌ వైద్యులపై ప్రసంశలు కురిపించారు. ‘నిమ్స్‌’ పేదల దేవాలయం అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ చేశారు. ప్రమాదవశాత్తు ఛాతిలో దిగిన బాణాన్ని తొలగించి ఒక ఆదివాసీ యువకుడిని ప్రాణాపాయ స్థితి నుంచి నిమ్స్‌ వైద్యులు కాపాడారు.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌కు చెందిన గుత్తికోయ గిరిజన తెగకు చెందిన సోది నందాకు ప్రమాదవశాత్తు ఛాతిలో బాణం గుచ్చుకోగా మొదట భద్రాచలం ఏరియా ఆసుపత్రి అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు, గాంధీకి రాగా చివరికి నిమ్స్‌ డాక్టర్లు ఆపరేషన్‌ చేసి బాణాన్ని తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు సమాచారం. అయితే నిమ్స్‌ వైద్యులు అతినిని ప్రత్యేక కేసుగా పరిగణించి ఫ్రీగా ట్రీట్మెట్‌ చేశారు. దీంతో వైద్యులపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ANN TOP 10