(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి.. వచ్చి రాగానే ఆరోగ్యశ్రీ సేవల విలువలను రూ.10 లక్షలకు పెంచిన విషయం తెలిసిందే. అలాగే యువతపై ప్రభావం చూపుతున్న డ్రగ్స్, గంజాయిపై ఇప్పటికే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా.. తెలంగాణ రాష్ట్రంలో గుట్కా తయారీ, అమ్మకంను నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఫుడ్ సేఫ్టీ కమిషనర్ జారీ చేశారు. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.









