ఛత్తీస్‌గడ్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. గురువారం ఛత్తీస్‌గడ్‌లోని నారాయణ్‌పూర్‌లో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే మరణించిన మావోయిస్టులు ఎవరన్నది ఇంకా అధికారికంగా పోలీసులు ప్రకటించలేదు. ఇక ఛత్తీస్‌గడ్ అడవులను భద్రతాదళాలు జల్లెడ పడుతున్నాయి. వరస ఎన్‌కౌంటర్లలో అనేక మంది మావోయిస్టులు మరణించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు ఇటీవల కాలంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో మరణించారు. తాజాగా జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు చనిపోయారని, వారి వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
