AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం సిపాయి అనుకున్నా.. అంత ఉత్తదే: ఈటల రాజేందర్

సర్వేలను తలదన్నేలా లోక్‌సభ ఫలితాలు ఉంటాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం నల్గొండ జిల్లాలోని దేవరకొండలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకి ఓటు వేయాలని చెప్పారని, ఇప్పుడు అదే పార్టీ మీద నిలబడ్డాడు మరి ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తాడని కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టని పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆయన మండిపడ్డారు. కేవలం 5, 6 నెలల కాలంలో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమేనన్నారు. ప్రభుత్వం అన్ని గమనిస్తుందని, తప్పు చేసిన వాళ్ళందరూ తప్పకుండా జైలుకు వెళ్తారని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదని, సచ్చేది లేదు అని విమర్శలు చేశారు. బీజేపీ అభ్యర్థిగా 40 ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకుని ఎత్తిన జెండా దింపని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ బరిలో తాము నిలిపామని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులను ఆనాడే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించినా నేటికీ అమలు చేయలేదని బాధ ఉద్యోగుల్లో కనిపిస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలు చెల్లింపు విధానంతో మళ్ళీ ఆర్టీసీని దివాలా తీసే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద సిపాయి అనుకున్నాని, కానీ అంత ఉత్తదే అంటూ కామెంట్స్ చేశారు. పదేళ్లలో అధికారంలోకి ఉంటున్న తమ మోడీ ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు రాలేదన్నారు. 2014, 2029 ఒక్క హామీ ఇవ్వకుండానే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తాయని ప్రజలే అంటున్నారని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ANN TOP 10