AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎమ్మెల్యే ఏలేటి ఆరోపణలు ఫాల్స్ అలిగేషన్స్.. జగ్గారెడ్డి కౌంటర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు రెండు రకాలు ఉంటాయని, ఒకరు వాస్తవాలు మాట్లాడే వారు ఉంటారని, రెండవ రకం ఏది లేకపోయినా అవాస్తవాలను ప్రచారం చేస్తుంటారని చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బట్ట కాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తనను మాట్లాడుమన్నారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయని, పంట తడిసి పోయిందన్నారు. ప్రభుత్వం ముందే స్పందిస్తే రైతులు సంతోషిస్తారని, అలాగే తడిసిన ధాన్యం కూడా తరుగు లేకుండా కొనుగోలు చేస్తామని మంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. తాను కూడా క్షేత్రస్థాయిలో ఉన్న ఐకేపీ సెంటర్ల వద్ద చెక్ చేసి వచ్చానని, తడిసి రంగు మారి, మొలకెత్తిన ధాన్యం కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మూడు వేలకు పైగా ఉన్న రైస్ మిల్లుల నుంచి పెండింగ్ బకాయిలు ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు.

*ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కౌంటర్*

ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద మహేశ్వర్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. వైట్ పేపర్ లాంటి ఉత్తమ్ మీద బురద ఎందుకు జల్లుతున్నారని ఎమ్మెల్యే ఏలేటిని ప్రశ్నించారు. ఆయన ఫస్ట్ టైం బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా పని చేస్తున్నారని, అనుమానం రావడం తప్పుకాదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరారు. మహేశ్వర్ రెడ్డి చేసే ఆరోపణలు ఫాల్స్ అలిగేషన్స్ అంటూ ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో పోరాటం చేసి కెప్టెన్‌గా పని చేసిన వ్యక్తి మీద ఆరోపణలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని అన్నారు. నిజంగా స్కామ్ జరిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసేవారు కాదా అంటూ ప్రశ్నించారు. ఆధారాలు ఉన్నాయి.. చర్చకు రండి అనేవి పాత డైలాగ్స్ అన్నారు. ఇంతటితో ఇది క్లోజ్ చేసుకోండని ఏలేటికి సూచించారు. సీఎం రేసులు ఈ ఐదు ఏళ్ళు ఎవరు లేరని, సీఎంగా రేవంత్ రెడ్డి ఐదేళ్లు ఉంటారని చెప్పారు. త్వరలో మంత్రి వర్గం విస్తరణ మీద అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని, కిషన్ రెడ్డితో మా కెప్టెన్ రేవంత్ రెడ్డి ఆడుకుంటారని జగ్గారెడ్డి కామెంట్స్ చేశారు.

ANN TOP 10