AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం రేవంత్‌ రెడ్డి

(అమ్మన్యూస్‌, తిరుమల)
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని రోడ్డు మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. శ్రీ పద్మావతి నగర్‌లోని రచన అతిథి గృహం వద్దకు చేరుకున్న రేవంత్‌ రెడ్డికి టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. రాత్రి తిరుమలలోని బస చేసి బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు.

ANN TOP 10