రాష్ట్రంలోని పది యూనివర్సిటీలకు ఇన్‌చార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేటితో గత వీసీల పదవీకాలం ముగిసింది. 2021 మే 22న పది వర్సిటీలకు వీసీలను గత ప్రభుత్వం వీసీలను నియమించింది. ఆ పదవీ కాలం నేటితో ముగుస్తుండగా.. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ 10 యూనివర్సిటీలకు ఇన్‌ఛార్జ్ వీసీలను నియమించింది. కాగా సీనియర్ ఐఏఎస్ అధికారులను వీసీలుగా ప్రభుత్వం నియమించింది.
ఉస్మానియా యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – దానకిషోర్
కాకతీయ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – వాకాటి కరుణ
తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – సందీప్ సుల్తానియా
మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – నవీన్ మిట్టల్
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – రిజ్వి
శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – సురేంద్ర మోహన్
జేఎన్‌టీయు ఇన్‌ఛార్జ్ వీసీ – బి. వెంకటేశం
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – జయేష్ రంజన్
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – శైలజ రామయ్యర్
పాలమూరు యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ – నదీం అహ్మద్









