ప్రధాని నరేంద్ర మోదీ అద్యక్షతన మరో నాలుగు భారీ మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్‌లలో రైల్వే మౌలిక సదుపాయాలు మరియు అనుసంధానానికి ఒక పెద్ద ప్రోత్సాహం లబించనుందని కేంద్రం తెలిపింది.
భారతీయ రైల్వే నెట్‌వర్క్‌కు ఎంతో అవసరమైన సామర్థ్యాన్ని జోడించి, లక్షలాది మంది ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నాలుగు మల్టీట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా ప్రయాణీకులు, సరుకు రవాణాను బలోపేతం చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కోంది. ప్రజా రద్దీని తగ్గించడం. లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు అనుసంధానం, వాణిజ్యం, పర్యాటకాన్ని మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.








