AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవూరికి టికెట్ ఎలా ఇస్తావ్..సీఎం రేవంత్ రెడ్డి పై కొండా సుస్మిత ఫైర్..!

పరకాల నియోజకవర్గంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలను కొండా సుస్మిత నిర్వహించారు. ఎస్ ఎస్ గార్డెన్‌లో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనతరం కొండా సుస్మిత సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

గీసుగొండ మండలం మాకు కొండంత అండ అని అన్నారు. 9ఏళ్లు నరకం చూసాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇవే నా సూటి ప్రశ్నలు అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పీసీసీ కావాలని కోరుకున్న మొదటి వ్యక్తులు కొండా దంపతులు ఉన్నారని అన్నారు. నువ్వు పీసీసీ అయ్యాక మొదటిసారి వచ్చింది మా ఇంటికే అని గుర్తు చేశారు. మా ఇంటికి వచ్చి ఎమ్మెల్సీ ఇస్తానని మాట ఇచ్చింది నువ్వు అని, బీసీ బిడ్డకు ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని ప్రశ్నించారు.

రేవూరిని గెలిపియ్యాలని చెప్పి వెళ్ళావు. కొండా మురళీ తిరిగి గెలిపిస్తే రేవూరి ఎమ్మెల్యే అయ్యాడని అన్నారు. రెండు, మూడు నియోజక వర్గాల్లో తిరిగి గెలిపించింది కొండా మురళి అని అన్నారు. సీఎం అయితే నీకు కళ్ళు నెత్తికి ఎక్కాయా? ఇప్పుడు రాజీనామా చేసి ఎన్నికలకు రండి పరకాలలో నా ఇళ్ళు ఇస్తా, అక్కడే ఉండి రేవూరిని గెలిపించుకో రేవూరి గెలుస్తాడో.. కొండా మనిషి గెలుస్తాడో చూద్దాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సంస్కృతి నీకు ఎక్కలేదు. టీడీపీ సభ్యులంటే నీకు ప్రేమ ఎందుకని అన్నారు.

కాంగ్రెస్ సభ్యులు అంటే ఎందుకు వివక్ష? డైపర్ వేసుకుని తిరిగే రేవూరికి ఎలా టికెట్ ఇస్తానన్నావని ఫైర్ అయ్యారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవంలో కనీసం మంత్రి పొన్నం ఫోటో కూడా వేయలేదు. బీసీ నేతలంటే నీకు చులకన. టికెట్లు ఎవరికి ఇవ్వాలో అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు. 119 నియోజకవర్గాల్లో టికెట్లను నువ్వే ప్రకటించు, అధిష్టానం ఎందుకంటూ ఫైర్ అయ్యారు.

ANN TOP 10