AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభుత్వానికి హరీష్ రావు డిమాండ్ ఇదే!

రాష్ట్రంలో రైతులకు జీలుగు, జనుము విత్తనాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొనుగోలు కేంద్రాల్లో లారీల నుంచి ధాన్యం దించే పరిస్థితి లేదని, దీంతో లారీ డైవర్లు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారని దుయ్యబట్టారు. ధాన్యం లోడు దించట్లేదని లారీ డ్రైవర్లు వడ్ల రవాణాకు వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో అన్ని రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు సన్నరకం వడ్లకు బోనస్ ఇస్తానని ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అంటూ దుయ్యబట్టారు.

అన్ని రకాల వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని, మిగతా పంటలకు కూడా బోనస్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుబంధు డబ్బులను జూన్ నెలలోనే వేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని మొలకెత్తక ముందే తరలించాలని సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండిస్తే మనం ఇవాళ తింటున్నామని గుర్తు చేశారు. వడ్ల విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వకుంటే రైతులందరినీ ఏకం చేసి పోరాడుతామని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు.

ANN TOP 10