AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉత్తమ్ ఢిల్లీకి రూ. 100 కోట్లు పంపిండు.. ఏలేటి సంచలన ఆరోపణలు

బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్తగా యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్తగా యూ- ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, రూ. 500 కోట్లు చేతులు మారాయని అన్నారు. అందులో రూ.100 కోట్లు మంత్రి ఉత్తమ్ ఢిల్లీకి పంపించారని అన్నారు. ఎన్నికల ఖర్చుల కోసమే రూ.100 కోట్లు ఢిల్లీకి పంపించారని చెప్పారు. తాను సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే మంత్రి ఉత్తమ్ డబ్బులు పంపించారని వ్యాఖ్యానించారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు. తోటి మిత్రులు ఇచ్చి ముందుకు వెళ్తుండటంతో భయపడి ఉత్తమ్ ఇలా చేస్తున్నారన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి బాధ్యత వహిస్తారా? అధికారులు బాధ్యత వహిస్తారా? అని నిలదీశారు.

సివిల్ సప్లయ్ కమిషనర్ చౌహాన్‌కి వ్యవసాయం గురించి తెలియదనకుంటా? అని విమర్శించారు. రైతులకు డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లకు సంబంధించిన డేటా ఉందా? డిఫాల్టర్ల వివరాలు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ దీనిపై అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాము ఈ తప్పులను నిరూపిస్తామన్నారు. ఇది సామాన్యుల రక్తాన్ని తాగే కుంభకోణమని, స్టాక్ రైస్ మిల్లర్ల వద్ద ఉంటే ప్రభుత్వం వడ్డీ ఎందుకు కట్టాలి.. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. అలాగే కేవలం సన్నరకం వడ్లకు బోనస్ రూ. 500 ఇస్తామనడం దారుణమని అన్నారు. రాష్ట్ర ఉష్ణోగ్రత దృష్ట్య ఎక్కువగా పండేది దొడ్డు బియ్యమని చెప్పారు.ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాత్రమే సన్నబియ్యం పండిస్తారని, మిగిత 30 జిల్లాలో దొడ్డు బియ్యమే పండిస్తారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు చావు కబురు చల్లగా చెబుతారని ఏలేటి మహేశ్వర్ రెడ్డి దుయ్యబట్టారు.

ANN TOP 10