AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘కోడ్ ముగిసాక ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తాం’

ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణరావు అన్నారు. మంగళవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చాలా శాఖలలో బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని అన్నారు. మద్యం కొరత ఉంటే ప్రజలకు నష్టం లేదన్నారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప బదిలీలు జరిగేవి కావని చెప్పారు. ఇప్పుడు తమ ప్రభుత్వంలో అలాంటి పైరవీలు, ముడుపులు లేకుండా పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, తాము పరిశీలించలేదన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్‌ఎస్ నేతలు మాటలు ఉన్నాయని విమర్శించారు. కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తామన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, తాము పరిశీలించలేదని స్పష్టం చేశారు. మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్‌ను పటిష్టంగా నివారిస్తున్నామని తెలిపారు. మద్యం విక్రయాలు తగ్గితే ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని, ప్రజలకు కాదని అన్నారు. టానిక్‌లకు గత ప్రభుత్వ ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఒక్కోదాన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణరావు పేర్కొన్నారు.

ANN TOP 10