(అమ్మన్యూస్, బెంగళూరు):
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేవ్ పార్టీపై బెంగళూరు సీపీ దయానంద కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. డ్రగ్స్ పెడ్లర్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చాలామంది సెల్ ఫోన్లను సీజ్ చేశామన్నారు. అనుమానితుల బ్లడ్ శాంపిల్స్ సేకరించామన్నారు. రేవ్ పార్టీకి రాజకీయ నేతలు వచ్చినట్లు సమాచారం లేదన్నారు. డ్రగ్స్ కొనుగోలుపై ప్రత్యేక చట్టల ద్వారా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు.
ఇద్దరు నటులు ఈ పార్టీలో దొరికారన్నారు. ఇద్దరు నటుల రక్త నమునాలు తీసుకున్నామని తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చిన ఐదుగురిని అరెస్ట్ చేశామన్నారు. ఎప్పుగూడ పీఎస్‌కు రేవ్ పార్టీ కేసు బదిలీ చేసినట్లు స్పష్టం చేశారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
కీలక విషయాలు వెలుగులోకి..
రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. సన్ సెట్ – సన్ రైజ్ విక్టరీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించినట్లు తెలుస్తోంది. బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ వ్యాపారవేత్త మేన్ వాసు పార్టీ నిర్వహించినట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు పార్టీ నడిచినట్లు వినికిడి. భారీ మ్యూజిక్ సౌండ్‌తో స్థానికులకు నిర్వాహకులు ఇబ్బందులు కలిగించారు. నిన్న తెల్లవారు జాము 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్‌పై పోలీసులు దాడి నిర్వహించారు. అయితే రిమాండ్ రిపోర్టులో సినీ, రాజకీయ ప్రముఖల పేర్లను చేర్చకపోవడంతో బెంగళూరు పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.









