AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీసీఎస్‌ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు.. నగరంలో ఆరుచోట్ల దాడులు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌ లో దాడులు చేపట్టారు. మంగళవారం ఉదయాన్నే ఆశోక్‌ నగర్‌ లోని ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసానికి చేరుకుని నివాసంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌ లోని ఏసీపీ స్నేహితులు, బంధువుల ఇళ్లకూ వెళ్లిన అధికారులు మొత్తంగా సిటీలో ఆరుచోట్ల సోదాలు చేశారు. ఇబ్రహీంపట్నం మర్డర్‌ కేసులో ఉమా మహేశ్వరరావు సస్పెండయ్యారు. డబుల్‌ మర్డర్‌ నిందితుడు మట్టారెడ్డి నుంచి ముడుపులు తీసుకున్నాడని ఉమామహేశ్వరరావుపై అభియోగాలు ఉన్నాయి.

ANN TOP 10