AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన సోనియా, రాహుల్, ఖర్గే

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీరభూమిలో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, రాహుల్‌ నివాళులర్పించారు. అలాగే ప్రధాని మోడీ ‘మన మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ గారికి నా ‘నివాళులు’ అంటూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, తన దివంగత తండ్రి, మాజీ ప్రధానిని స్మరించుకుంటూ ఎక్సో్ల ఒక పోస్ట్‌ చేశారు. దానిలో రాహుల్‌ తన తండ్రితో కలిసి ఉన్న చిన్ననాటి ఫొటోను కూడా పంచుకున్నారు, అందులో రాజీవ్‌ గాంధీ రాహుల్‌ భుజాలపై చేయి వేసుకుని కనిపిస్తారు. ఆ పోస్ట్‌లో, ‘నాన్న, మీ కలలు, నా కలలు, మీ ఆకాంక్షలు, నా బాధ్యతలు. మీ జ్ఞాపకాలు, ఈ రోజు, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటాయి‘ అని రాహుల్‌ పేర్కొన్నారు.

ANN TOP 10