AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్‌ను కలుస్తా: మాజీ మంత్రి మల్లారెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కలుస్తానని అన్నారు. అయితే పేట్ బషీరాబాద్‌లో రెండున్నర ఎకరాల స్థలం వివాదంలో మల్లారెడ్డిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు మర్రి రాజశేఖరరెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివాదాస్పద భూమి విషయంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్‌ను కలిసి వివరిస్తామని చెప్పారు. అందుకు సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరామని చెప్పారు. ఇక సుచిత్రలోని వివాదాస్పద భూమిని కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి, అలాగే మరో వర్గానికి భూ వివాదం నడుస్తోంది. కుత్బుల్లాపూర్ సుచిత్రా పరిధిలోని 82 సర్వే నంబర్ లోని వివాదాస్పద 1.6 ఎకరాల భూమిలో ప్రస్తుతం సర్వే చేస్తున్నారు.

ANN TOP 10