మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్ అయ్యారు. పేట్‌బషీరాబాద్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో ల్యాండ్ దగ్గరకు వచ్చి హల్చల్ సృష్టించారు. కోర్టు వివాదంలోఉన్న ఓ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్థలంలో వేసిన భారికెడ్లను మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి అనుచరులు తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, మల్లారెడ్డి, రాజశేఖరరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడంతో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు.
