ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, తరువాత జరిగిన హింసాకాండపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది. 13 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన సిట్‌కు ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహించనున్నారు. ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటైంది. సీఐడీ, ఏసీబీలో ఉన్న అధికారులతో ఈ బృందాన్ని ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక సంఘటనలపై కూడా ఈ కమిటీ దర్యాప్తు జరపనుంది. ఇప్పటికే నమోదైన కేసుల పరిస్థితిని సమీక్షించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కేసుల్లో అదనపు సమాచారం వస్తే ఎఫ్‌ఐఆర్‌లో అదనపు సెక్షన్ల కింద నమోదు చేయాలని ఈసీ స్పష్టం చేసింది. దర్యాప్తును సమీక్షించి అవసరమైతే అదనపు చర్యలుకు సిఫార్సు చేయాలని ఆదేశించింది. అవసరమైతే తాజా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాలని సూచించింది. దర్యాప్తు నివేదికను తమకు అప్పగించాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.