AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్య.. నగల కోసమే చంపేశారా?

హైదరాబాద్‌ : ములుగు జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ దారుణ హత్యకు గురైంది. మెడకు స్కార్ఫ్‌ను చుట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చిన సంఘటన ములుగు జిల్లా తడ్వాయి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుజాత(48) అనే మహిళ కాటాపురంలో అంగన్‌వాడీ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నది.

కాగా, మంగళవారం ఆమె విధులు ముగించుకొని తన స్వగ్రామమైన ఏటూరునాగారం బయలుదేరారు. అయితే బుధవారం తాడ్వాయి సమీపంలోని అడవిలో తునికాకు కోసం వెళ్లిన కూలీలకు సుజాత మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సుజాతకు చెందిన నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్‌ చోరీకి గురైనట్లు సీఐ శంకర్‌, ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ANN TOP 10