AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భార్య భర్తల మధ్య ‘కురుకురే’ చిచ్చు.. విడాకులు కోరిన భార్య!

కురుకురే ప్యాకెట్ ఓ కాపురంలో చిచ్చు పెట్టింది. భర్త తన కోసం కుర్‌కురే ప్యాకెట్‌ తీసుకురాలేదన్న కారణంతో అలిగి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య విడాకులకు దరఖాస్తు చేసుకుంది. వినడానికి కాస్త కామెడీగా ఉన్నా.. ఐదు రూపాయల కురుకురే విడాకులకు కారణమైంది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైంది. ఆమెకు రోజూ కుర్‌కురే తినడం అలవాటు. కొన్నాళ్లు భర్త కూడా ఎలాంటి అడ్డు చెప్పకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు. అయితే, జంక్‌ఫుడ్ రోజూ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అది ఇరువురి మధ్య గొడవకు కారణమైంది. అయినప్పటికీ అదేమీ మనసులో పెట్టుకోకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చే భర్త.. ఆ కుర్కురే ప్యాకెట్ ఒకరోజు తీసుకువెళ్లడం మర్చిపోయాడు. దీంతో పెద్ద రచ్చ రచ్చ చేసింది అతని భార్య.

ఈ క్రమంలోనే కోపంతో పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ విడాకులు ఇప్పించాలని కోరింది. దీంతో స్పందించిన పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇప్పించాలని నిర్ణయించారు.

ANN TOP 10