AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటర్ల వేలికి పడే ‘సిరా చుక్క’ తయారయ్యేది హైదరాబాద్‌లోనే.. 37 ఏళ్లుగా తయారీ

100 దేశాలకు సరఫరా..!

“నీ వేలిపై సిరా చుక్క దేశ ప్రగతికి వేగుచుక్క” అన్నాడు ఓ కవి. ఎన్నికల్లో ఓటు ఎంత ముఖ్యమో.. ఆ ఓటు వేసే వారి వేలికి వేసే సిరా చుక్కది కూడా కీలక పాత్రే. ఈ సిరా చుక్క.. కేవలం ఓటేశామని చెప్పడానికి గుర్తు మాత్రమే కాదండోయ్.. దొంగ ఓట్లను నిరోధించే ఆయుధం కూడా. అందుకే.. ఇండియాతో పాటు చాలా దేశాలు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్ల వేలికి సిరా చుక్క పెట్టడం తప్పనిసరి చేశాయి. అలాంటి సిరాను మన హైదరాబాద్‌లో తయారు చేస్తున్నారు.

భారత ఎన్నికల సంఘం నిబంధన 37 ప్రకారం ఓటు వేసిన వ్యక్తి ఎడమ చేయి చూపుడు వేలుపై సిరా గుర్తును వేస్తారు. ఈ సిరా చుక్కా వేసే పద్ధతిని ఎన్నికల సంఘం 1962లో ప్రవేశపెట్టింది. అయితే.. ఎన్నికల్లో వాడే ఈ సిరాను కర్ణాటకలోని మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ కంపెనీ తయారు చేసి సరఫరా చేస్తోంది. దేశం‎లో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అదే కంపెనీ నుంచి సిరా పంపిణీ చేసేవారు.

ఆ తర్వాత.. ఈ సిరాని 1990 నుంచి హైదరబాద్‎లోనూ తయారు చేయటం ప్రారంభించారు. ఉప్పల్‎లోని రాయుడు ల్యాబొరేటరీస్ అనే సంస్థ ఈ సిరాని తయారు చేస్తోంది. మైసూర్ పేయింట్స్ అండ్ వార్సిష్ కంపెనీతో పోలిస్తే.. ఇది చాలా చిన్న కంపెనీ. అయినప్పటికీ.. సుమారు100 దేశాలకు ఈ సిరాని ఎగుమతి చేస్తోంది. ఆయా దేశాల్లో ఎన్నికల కోసం దాదాపు 100 దేశాలకు ఈ సిరా (ఇండెలబుల్ ఇంక్)‎ను సరఫరా చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిదులు చెప్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల‎తో పాటు.. శ్రీలంక, దక్షిణాఫ్రికా, నైజీరియా, మాల్దీవులు, జాంబియా, ఇథియోపియా, ఈస్టర్ తిమోర్ తదితర దేశాలకు కూడా సిరాను సరఫరా చేస్తున్నట్టు కంపెనీ నిర్వాహకులు చెప్తున్నారు.

ANN TOP 10