బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు దంపతులు సోమవారం స్వగ్రామం చింతమడకకు వెళ్లనున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్, శోభ దంపతులు ఓటు వేయనున్నారు. ఎర్రవెల్లి నివాసం నుంచి సోమవారం చింతమడకకు బయలుదేరి వెళ్తారు. ఉదయం 11.00 గంటలకు చింతమడక గ్రామంలో కేసీఆర్ దంపతులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు.









