హైదరాబాద్ పాతబస్తీలోని భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూ వీలర్ పెట్రోల్ ట్యాంక్ పేలడంతో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సమీప ప్రైవేట్ దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మొఘల్ పురా అస్లా ఫంక్షన్ హాలు సమీపంలో రోడ్డుపై వెళుతున్న బైక్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైక్ మీద ప్రయాణిస్తున్న వెంటనే వాహనం నిలిపేశారు. మంటలు ఆర్పివేసేందుకు స్థానికులు గుమిగూడగానే పెట్రోల్ ట్యాంకు ఒక్కసారిగా పేలిపోయింది. ఈ సమాచారం తెలుసుకున్న భవానీ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు.









