నిన్న.. మెన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన నాయకులు కాస్త రిలాక్స్ అవుతున్నారు. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా.. పోటీకి బరిలో ఉన్న అభ్యర్థులు, పార్టీ అధినేతల్లో టెన్షన్ నెలకొంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కూల్‌గా ఫుట్‌బాల్ ఆడారు. ఆయనకు స్పోర్ట్స్ లో ఇష్టమైనది ఫుట్ బాల్ కావడంతో ఖాళీ దొరికినప్పుడల్లా ఇలా ఎంజాయ్ చేస్తుంటారు. నిత్యం పర్యటనలు, సమావేశాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడిపే సీఎం.. సరదాగా ఫుట్‌బాల్ ఆడుతూ కనిపించారు. ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూవర్సిటీకి వెళ్లిన రేవంత్ అక్కడి విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. ప్రొఫెషనల్ క్రీడాకారుడికి మాదిరిగా స్టూడెంట్స్‌తో కలిసి గోల్ వేసేందుకు మైదానంలో పరుగులు తీశారు. ఫుట్‌బాల్ ఆడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎమ్ఆర్ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి తదితరులు విద్యార్థులతో కలిసి ఫుల్బాల్ ఆడారు. ఈ ఫుట్‌బాల్ మ్యాచ్‌కు సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు హర్కర్ వేణుగోపాల్, టీ శాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఏం ఏ ఫహీం ఇతరులు హాజరయ్యారు.
*రేపు కొడంగల్‌కు రేవంత్ రెడ్డి..*
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కొడంగల్‌కు వెళ్లనున్నారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ వేళ కొడంగల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆయన ఇవాళ సాయంత్రం కొడంగల్‌కు బయలుదేరి వెళ్లనుండగా.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన తన ఓటు హక్కును కొడంగల్‌లో వినియోగించుకోనున్నారు. సీఎం కొడంగల్‌కు వస్తున్న సందర్భంగా పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేశారు.









