AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజాసేవే లక్ష్యం: ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామి రెడ్డి

అమ్మన్యూస్‌, ఖమ్మం రూరల్: ప్రజా సేవ కోసమే ఎంపీగా పోటీ చేస్తున్నానని కాంగ్రెస్‌ ఖమ్మం లోక్‌‌సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామి రెడ్డి అన్నారు. గెలిపిస్తే చెంతనే ఉండి అభివృద్ధి చేస్తానని అన్నారు. గురువారం పోలేపల్లిలో స్విమ్మర్స్‌ అసోసియేషన్‌ సమావేశానికి హాజరై ప్రసంగించారు. తన తండ్రి సురేందర్‌ రెడ్డి సుధీర్ఘ కాలం కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధిగా ఉన్నారని తెలిపారు. పూర్తిగా అందుబాటులో ఉంటానని, జిల్లా మంత్రులు, రాజ్యసభ సభ్యురాలితో కలిసి సుపరిపాలన అందిస్తా అని హామీ ఇచ్చారు: ఈ సందర్భంగా మిత్రులు రఘురామిరెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గా ప్రసాద్‌, సీనియర్‌ నాయకులు మద్దీనేని స్వర్ణ కుమారీ, నగర అధ్యక్షులు మహ్మద్‌ జావేద్‌, మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నాయకులు కొప్పుల చంద్ర శేఖర్‌, లెఫ్ట్‌ కెనాల్‌ సిమ్మర్స్‌ అసోసియేషన్‌ బాధ్యులు మన్నె నరసింహా రావు, నరేందర్‌, లాయర్‌ గోవిందరావు, కల్వకుంట్ల గోపాల్‌ రావు, మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10