AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శాంసన్ వచ్చేశాడు, రాహుల్‌కు నిరాశ.. టీ-20 వరల్డ్‌కప్ భారత జట్టు ఇదే..

టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
రోహిత్ శర్మ కెప్టెన్, హార్దిక్ పాండ్యా వైస్‌ కెప్టెన్‌
వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్.. ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..?

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. వికెట్‌ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌లను ఎంపిక చేసింది. స్పిన్నర్ల కోటాలో యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌లకు అవకాశం కల్పించింది. సీనియర్‌ ప్లేయర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు.

అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత సెలక్షన్‌ కమిటీ జట్టును ప్రకటించింది. ఈ మేరకు రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించింది. ఇందులో వికెట్ కీపర్లుగా రిషభ్‌ పంత్‌, సంజూ శాంసన్‌లకు అవకాశం ఇచ్చింది. వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను నియమించింది. ఐపీఎల్‌లో రాణిస్తున్న శివమ్‌ దూబె, యుజ్వేంద్ర చాహల్‌లకు జట్టులో అవకాశం కల్పించింది. శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. రింకూ సింగ్‌కు ప్రధాన జట్టులోనే చోటు దక్కుతుందని భావించినప్పటికీ.. అతడికి మాత్రం నిరాశే ఎదురైంది.

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, అర్షదీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ సిరాజ్‌.

అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదికల్లో జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఇందులో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. భారత్ తన తొలి మ్యాచులో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. జూన్ 9న పాకిస్థాన్‌తో అమితుమీ తేల్చుకోనుంది.

ANN TOP 10