(అమ్మన్యూస్, హైదరాబాద్):
లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేయగా, తాజగా రాష్ట్రంలోని 10 పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ (అసెంబ్లీ బై ఎలక్షన్) స్థానానికి అధిష్టానం ప్రత్యేక పరిశీలకులను నియమించింది. వివిధ రాష్ట్రాల నేతలతో కూడిన ప్రత్యేక పరిశీలకుల జాబితాను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
పరిశీలకులు వీరే..
మెదక్: కొడికున్నిల్ సురేష్
జహీరాబాద్: రాజ్ మోహన్ ఉన్నితాన్
మహబూబ్ నగర్: జి.సి. చంద్రశేఖర్ట
మల్కాజిగిరి: ఎస్.జ్యోతిమణి
చేవెళ్ల:హైబీ ఈడెన్
ఆదిలాబాద్: షఫీ పరంబిల్
నిజామాబాద్:ఎన్.ఎస్ బోసురాజు, మంతర్ గౌడ
నాగర్ కర్నూల్:పి.వి. మోహన్
సికింద్రాబాద్: రిజ్వాన్ అర్థద్
వరంగల్: రవీంద్ర డాల్వీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్:పి.విశ్వనాథన్









