ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రముఖ మిమిక్రీ కళాకారుడు జల్లారపు రమేష్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందిన రమేష్‌కు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మంచి పేరుంది. జర్నలిస్టుగా, మిమిక్రీ కళాకారుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రమేష్ పోటీకి తెరవెనక ఎవరు ఉన్నారన్నది ఆసక్తి కరంగా మారింది. దీనిపై ఆయన కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మే2 న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుండగా.. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.









