కాంగ్రెస్ వినూత్న ప్రచారం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తోంది. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా గాడిద గుడ్డు అంటూ పెద్ద గుడ్డును గాంధీభవన్ వద్ద ఏర్పాటు చేసింది.
ఏ హామీ నెరవేర్చని బీజేపీ..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఎన్నో హామీలు ఇచ్చి హామీలను నెరవేర్చలేదని, కేంద్ర కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీల లిస్టును జతచేసి ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అంటూ పెద్ద గుడ్డును ఏర్పాటు చేసింది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా అడిగామని, బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలతో సమాన వాటా కావాలని అడిగామని, కానీ బీజేపీ ఇచ్చింది మాత్రం గాడిదగుడ్డు అంటూ పేర్కొంది. బీజేపీ తెలంగాణా అడిగినవి ఇవ్వలేదని చెప్పింది. త్రిబుల్ ఐటీ, మెడికల్ కళాశాల కావాలని కోరినా ఇచ్చింది ఏమీ లేదని, 811 టీఎంసీ కృష్ణా జలాలలో సరైన వాటా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పేర్కొంది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీ లో వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ కు ఇండస్ట్రియల్ కారిడార్ ఏది అడిగినా ఇవ్వలేదన్నారు. నారాయణపేట హ్యాండ్లూమ్ పార్క్, ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, ఇండస్ట్రియల్ పార్కులు, నవోదయ – కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటు ఏది అడిగినా బీజేపీ చేయలేదని, అందుకే తెలంగాణా భవన్ లో గాడిద గుడ్డు .. ఏర్పాటు చేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం గాడిద గుడ్డు సర్వత్రా హాట్ టాపిక్‌గా మారింది.









