లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ స్థానానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి 2021 మార్చిలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2027 మార్చి వరకు పదవి కాలం ఉండగా.. ఇటీవల ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి గత డిసెంబర్ 9న రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఈ నేపథ్యంలోనే ఆ ఎన్నికకు తాజాగా షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. మే2న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మే 2 నుంచి 9 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మే 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. మే 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరగనుండగా.. జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇక ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఆ పార్టీ ఖరారు చేసింది.
