AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది.. ఖబడ్దార్!: కంది శ్రీనివాసరెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చే ధైర్యం ఎవరికీ లేదన్నారు. 48 ఎనిమిది గంటల్లో కాంగ్రెస్ పార్టీని కూలుస్తామని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం అర్థరహితమన్నారు. ఎవడ్రా ప్రభుత్వాన్ని కూల్చేది ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూల్చేస్తారా అంటూ నిలదీశారు. ప్రజలందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూల్చేస్తారా? ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూల్చేస్తారా అంటూ ఏలేటిని ప్రశ్నించారు. అలాంటి కుట్రలు చేస్తే చెట్టుకు కట్టేసి ఆడవాళ్ల కొడుతారని కౌంటర్ ఇచ్చారు.ఊర్లలో చెట్టుకు కట్టేసి కొడుతారన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడం అంటే ప్రజాస్వామ్యన్ని హత్య చేయడమేనని అన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపిస్తామని కంది శ్రీనివాసరెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.

ANN TOP 10