ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్ధతుగా డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన జన జాతర భారీ బహిరంగ సభకు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ గడ్డకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఆదివాసీ పెద్దలు తలపాగా చుట్టారు. ఆదివాసీ సంప్రదాయ డోలు వాయించి సభలో రేవంత్ రెడ్డి అందరినీ ఆకట్టుకున్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఒక సామాన్యుడిగా ప్రజల్లో కలిసిపోయే నిజమైన నాయకుడు అంటూ ఆ ఫోటోలను చూసిన పలువురు చేస్తున్నారు.









